ఖతార్లో కొత్తగా 870 కోవిడ్ కేసులు.. ముగ్గురు మృతి
- April 03, 2021
దోహా:ఖతార్ లో కరోనా తీవ్రత మళ్లీ ఉధృతమవుతోంది.గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 870 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కొత్తగా నమోదైన 870 కేసుల్లో 748 కమ్యూనిటీ కేసులని, మిగిలిన 122 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 1,82,548 పెరిగింది.ప్రస్తుతం 16,779 పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 428 మంది బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 1,65, 471 కి చేరింది.కరోనా తీవ్రత పెరగడం వల్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బహిరంగ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అలాగే భౌతిక దూరం పాటించాలని సూచించింది.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







