జీతం ఇవ్వలేదని, షాప్ తగలబెట్టిన వ్యక్తి, 1 మిలియన్ దిర్హాముల నష్టం
- April 05, 2021
దుబాయ్:27 ఏళ్ళ సేల్స్ మేన్, తాను పనిచేసిన ఓ వస్త్ర దుకాణాన్ని తగలబెట్టాడు. ఈ క్రమంలో 1 మిలియన్ దిర్హాముల నష్టం వాటిల్లింది. నైఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోట చేసుకుంది. వివరాల్లోకి వెళితే, షాపు ఓనర్.. తన వద్ద పనిచేసిన సేల్స్ మేన్ కి జీతం చెల్లించలేదని తేలింది. బాధితుడి రెసిడెన్సీ రద్దవడానికి కూడా షాపు ఓనర్ కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధితుడు దొంగతనానికి యత్నించాడు. అయితే, షాపులో డబ్బు దొరక్కపోవడంతో, షాపుని తగలబెట్టాడు. లైటర్ సాయంతో షాపులో మంటలు వచ్చేలా చేసి, షట్టర్ మూసివేవాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ పరిశీలించగా, అసలు విషయం బయటపడిందని షాప్ ఓనర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







