సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
- April 05, 2021
హైదరాబాద్:తెలంగాణలో సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్‌పై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తుల మేరకు పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు తక్షణమే జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శిని ఆదేశించారు.సీఎం ఆదేశాల మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..







