అత్యవసర సేవలు మినహా ఆన్ లైన్లోనే వైద్య సేవలు
- April 06, 2021
దోహా:కోవిడ్ తీవ్రత సాధారణ వైద్యసేవలపై ప్రభావం చూపుతోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో వైద్యసేవలకు సంబంధించి ఖతార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి పీహెచ్సీసీలలో సాధారణ వైద్యసేవల కోసం నేరుగా ఆరోగ్య కేంద్రాలకు రావొద్దని ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా అన్ని సాధారణ వైద్య సేవలు ఆన్ లైన్లోనే అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో వైద్య సిబ్బంది, ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నటలు పీహెచ్‌సీసీ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పీహెచ్‌సీసీ కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని, వ్యాక్సిన్ కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతోందని అభిప్రాయపడింది. అయితే..అత్యవసేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. అలాగే డెంటల్, చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్, అత్యవసరంగా స్కాన్లు, ఎక్స్ రేలు తీయాల్సిన అవసరం ఉన్నా, కోవిడ్ సంబంధిత సేవలకు సంబంధించి నేరుగా వైద్యసేవలు పొందవచ్చు. నేరుగా వైద్య సేవలు పొందేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఎమర్జేన్సీ పరిస్థితులు తలెత్తితే 1600కి కాల్ చేసి రెండు ఆప్షన్ ఎంచుకోవటం ద్వారా తామ పీహెచ్సీలో వైద్య సేవలను పొందవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







