వ్యాక్సి‌న్ తీసుకున్న‌వారికి మ‌క్కాలో ఉమ్రా ప్రార్థ‌న‌ల‌కు సౌదీ అనుమ‌తి

- April 06, 2021 , by Maagulf
వ్యాక్సి‌న్ తీసుకున్న‌వారికి మ‌క్కాలో ఉమ్రా ప్రార్థ‌న‌ల‌కు సౌదీ అనుమ‌తి

సౌదీ:ర‌‌మదాన్ మాసం వేళ ప‌విత్ర మ‌క్కా, మ‌దీనా మసీదుల్లో ఉమ్రా ప్రార్థ‌న‌ల‌కు నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేస్తూ సౌదీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌వారితో పాటు, కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న‌వారికి మ‌క్కా, మ‌దీనా మ‌సీదుల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తించనున్న‌ట్లు హ‌జ్‌, ఉమ్రా మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించి మార్గ‌నిర్దేశ‌కాల‌ను విడుద‌ల చేసింది. మ‌క్కా, మ‌దీనా మ‌సీదుల్లో ఉమ్రా ప్రార్థ‌న‌లు నిర్వ‌హించాల‌నుకునే భ‌క్తులు ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేష‌న్ కు సంబంధించి సౌదీ ప్ర‌భుత్వం గ‌తేడాది అందుబాటులోకి తీసుకొచ్చిన కోవిడ్ యాప్ త‌వ‌క్క‌ల్నాలో వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ను అప్ లోడ్ చేయాలి. అలాగే మ‌క్కా, మ‌సీదుల‌ను సంద‌ర్శించి ఉమ్రా ప్రార్థ‌న‌ల‌ను నిర్వ‌హించాల‌నుకుంటే ఎత్మార్న యాప్ లో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. రెండు వ్యాక్సిన్ల కోర్సు తీసుకున్నవారు లేదంటే తొలి వ్యాక్సిన్ తీసుకొని ప‌ద్నాలుగు రోజులు గ‌డిచిన వారు, కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న‌వారికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ చేసుకున్నాక మ‌క్కా, మ‌దీనా మ‌సీదు ప్రాంగ‌ణాల్లో భౌతిక దూరం పాటించేలా వ‌స‌తిని బ‌ట్టి స్లాట్ ను కేటాయిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com