అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా ఆన్ లైన్లోనే వైద్య సేవ‌లు

- April 06, 2021 , by Maagulf
అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా ఆన్ లైన్లోనే వైద్య సేవ‌లు

దోహా:కోవిడ్ తీవ్ర‌త‌ సాధార‌ణ వైద్య‌సేవ‌ల‌పై ప్ర‌భావం చూపుతోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరిగిపోతుండ‌టంతో వైద్య‌సేవ‌ల‌కు సంబంధించి ఖ‌తార్ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇక నుంచి పీహెచ్‌సీసీల‌లో సాధార‌ణ వైద్య‌సేవ‌ల కోసం నేరుగా ఆరోగ్య కేంద్రాల‌కు రావొద్ద‌ని ప్ర‌క‌టించింది. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా అన్ని సాధార‌ణ వైద్య సేవ‌లు ఆన్ లైన్‌లోనే అందిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. కోవిడ్ తీవ్ర‌త నేప‌థ్యంలో వైద్య సిబ్బంది, ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట‌లు పీహెచ్‌సీసీ అధికారులు వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో పీహెచ్‌సీసీ కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంద‌ని, వ్యాక్సిన్ కోసం వ‌చ్చే వారి సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ ప్ర‌క్రియ స‌జావుగా నిర్వ‌హించేందుకు కూడా ఈ నిర్ణ‌యం దోహ‌ద‌ప‌డుతోంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అయితే..అత్య‌వ‌సేవ‌లు మాత్రం య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించారు. అలాగే డెంట‌ల్‌, చిన్న‌పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌, అత్య‌వ‌స‌రంగా స్కాన్లు, ఎక్స్ రేలు తీయాల్సిన అవ‌స‌రం ఉన్నా, కోవిడ్ సంబంధిత సేవ‌ల‌కు సంబంధించి నేరుగా వైద్య‌సేవ‌లు పొంద‌వ‌చ్చు. నేరుగా వైద్య సేవ‌లు పొందేవారు ముంద‌స్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఎమ‌ర్జేన్సీ ప‌రిస్థితులు త‌లెత్తితే 1600కి కాల్ చేసి రెండు ఆప్ష‌న్ ఎంచుకోవ‌టం ద్వారా తామ పీహెచ్‌సీలో వైద్య సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com