వ్యాక్సిన్ వేయించుకుంటే బంగారం ఫ్రీ!!
- April 06, 2021
గుజరాత్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జనాలు వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ టీకా తీసుకునేలా జనాలను ప్రోత్సాహించడం కోసం గుజరాత్ స్వర్ణకార సంఘం వినూత్న ఆలోచన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న మహిళలకు బంగారు ముక్కుపుడక.. మగ వారికి హ్యాండ్ బ్లెండర్స్ బహుకరించింది.

వివరాలు.. రాజ్కోట్ స్వర్ణకార సంఘం నగరంలోని సోనీ బజార్ కిషోర్ సింగ్జీ ప్రాథమిక పాఠశాలలో ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ క్యాంప్ నిర్వహించింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న 751 మంది మహిళలకు బంగారు ముక్కపుడకలు, 580 మంది పురుషులకు హ్యాండ్ బ్లెండర్స్ని బహుకరించింది. గుజరాత్లో కోవిడ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఒక్కరోజే 3,160 కరోనా కేసులు నమోదు కాగా.. 15 మంది మరణించారు. ఇక సోమవారం ఒక్క రోజే ఇక్కడ 3,00,280 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







