కరోనా సెకెండ్ వేవ్..రాబోయే 4 వారాలు అత్యంత కీలకం: డాక్టర్ వీకే పాల్
- April 06, 2021
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో ఉందనీ... సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోందని నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ మహమ్మారిని నియంత్రించగలమని ఆయన అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. ''దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మరింత పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. గతంలో కంటే ఈ సారి మహమ్మారి తీవ్రస్థాయిలో ఉంది. కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ... మనం ఈ మహమ్మారిని నియంత్రించగలం..'' అని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో వచ్చే నాలుగు వారాలూ అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కామెంట్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కరనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 'జన్ భగీందరీ', 'జన్ ఆందోళన్'కు పిలుపునిచ్చినట్టు ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







