వ‌ర్క్ ప‌ర్మిట్ వ‌చ్చిన ఏడాదికి కార్మికుల బ‌దిలీకి కువైట్ గ్రీన్ సిగ్న‌ల్‌

- April 07, 2021 , by Maagulf
వ‌ర్క్ ప‌ర్మిట్ వ‌చ్చిన ఏడాదికి కార్మికుల బ‌దిలీకి కువైట్ గ్రీన్ సిగ్న‌ల్‌

కువైట్ సిటీ:కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశంలో కార్మిక శ‌క్తికి కొర‌త రాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు, చ‌ట్ట స‌వ‌ర‌ణలు చేప‌డుతున్న కువైట్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి పారిశ్రామిక రంగాల్లో కార్మికుల బదిలీకి సంబంధించి క‌నిష్ట కాల ప‌రిమితిని ఏడాదికి కుదించింది. అంటే వ‌ర్క్ ప‌ర్మిట్ జారీ అయి ఏడాది ముగిస్తే ఆ కార్మికుడిని య‌జ‌మాని అంగీకారంతో బ‌దిలీ చేసుకోవచ్చు. గ‌తంలో ఈ కాల‌ప‌రిమితి మూడేళ్లుగా ఉండేది. ఈ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ సల్మాన్ మంత్రిత్వ శాఖ నుంచి తీర్మానం జారీ చేశారు. అయితే...కార్మికుల బ‌దిలీ స‌మ‌యంలో య‌జ‌మాని అనుమ‌తి విష‌యంలో తీర్మానం నెంబ‌ర్ 9, 2016లో పేర్కొన్న నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com