ఎమిరేట్స్ ఐడీ డెలివరీ ఛార్జీ పేరుతో మోసాలు
- April 07, 2021
యూఏఈ:ఎమిరేట్స్ గుర్తింపు కార్డుల డెలివరీకి సంబంధించి కొందరు మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ అధికారులు హెచ్చరించారు. ఐడీ కార్డుల డెలివరీకి చార్జీలు చెల్లించాలంటూ కొందరు కేటుగాళ్లు లబ్ధిదారులకు ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని అడుగుతున్నారని వివరించారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐడీ కార్డుల డెలివరీ ఛార్జీలను అప్లికేషన్ సమయంలోనే అంతర్గతంగా వసూలు చేస్తున్నట్లు వెల్లండించారు. అందువల్ల కార్డులను పంపించేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డెలివరీ ఛార్జీలు చెల్లించాలంటూ ఫోన్ చేస్తే 6005 22222 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







