ఒమన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 07, 2021
మస్కట్: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులు, నివాసితులకు మాత్రమే సుల్తానేట్‌లోకి ప్రవేశించడానికి అనుమతించాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విదేశీయులకు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. గురువారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని సంబంధిత అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ సుప్రీం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రమదాన్ మాసం సందర్భంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఏడు గంటల పాటు నైట్ కర్ఫ్యూ కూడా విధించింది. ఈ కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని కమిటీ ఆదేశించింది.
అంతేగాక రమదాన్ సందర్భంగా మసీదులలో నిర్వహించే తారావీహ్ ప్రార్థనలను సైతం కమిటీ నిషేధించింది. దీంతోపాటు మసీదులు, గుడారాలు, బహిరంగ ప్రదేశాలలో అన్ని రకాల రమదాన్ సమావేశాలు, ఇఫ్తార్ విందులపై బ్యాన్ విధించింది. ఏప్రిల్ నెల మొత్తం అన్ని సామాజిక, క్రీడ, సాంస్కృతిక కార్యకలాపాలు నిషేధించబడ్డాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







