ఇంటీరియర్ మినిస్టర్‌తో రాయబారి చర్చలు

ఇంటీరియర్ మినిస్టర్‌తో రాయబారి చర్చలు

కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామెర్ అలి సబాహ్ అల్ సలెమ్ అల్ సబాహ్, భారత రాయబారి శిబి జార్జితో పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చ సందర్భంగా పలు కీలక అంశాల గురించి ఇరువురూ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని మరింత బలోపేతం చేయడంతోపాటుగా, హెల్త్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో ఇంకా బాగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించడం జరిగింది. కువైట్‌లో నివసిస్తోన్న భారతీయులకు సంబంధించిన సమస్యలపైన కూడా ఈ సందర్భంగా లోతైన చర్చ జరిగింది.

 

Back to Top