వైరల్ వీడియో: దేశ బహిష్కరణకు ఆదేశం

వైరల్ వీడియో: దేశ బహిష్కరణకు ఆదేశం

దుబాయ్: దుబాయ్‌లోని ఓ హై రైజ్ బిల్డింగ్ బాల్కనీలో డజను మంది మహిళలు అసభ్యకరంగా పోజులిచ్చారు. ఓ ఫొటోగ్రాఫర్ డైరెక్షన్ మేరకు వీరంతా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఎమిరేటీ సొసైటీ విలువల్ని అవమానపరిచేలా ఈ చర్యలున్నాయని పేర్కొన్న అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయ్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదీన్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం విచారణ పూర్తి చేసిందన్నారు. నిందితుల్ని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని దుబాయ్ మీడియా కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Back to Top