వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం రూ. 300 కోట్లు : ఈటెల

- March 02, 2016 , by Maagulf
వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం రూ. 300 కోట్లు : ఈటెల

 వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుంది. ప్రచారంలో భాగంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. రెప్పపాటు కరెంట్ పోకుండా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అని చెప్పారు.వరంగల్ కార్పొరేషన్‌కు పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఈటెల విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com