ఏటీఎం ద్వారా ఫీజుల చెల్లింపు

- March 02, 2016 , by Maagulf
ఏటీఎం ద్వారా ఫీజుల చెల్లింపు

బహ్రెయిన్‌లో యజమానులు, వ్యాపారవేత్తలు ఇక నుంచి న్యాబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ) బిల్స్‌ను ఎటిఎం కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఎల్‌ఎంఆర్‌ఎ డిప్యూటీ సీఈఓ షేక్‌ ఫవాజ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా ఈ విషయమై మాట్లాడుతూ, పన్ను చెల్లింపుదారుల కోసం ఈ సులభతరమైన మార్గాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఎటీఎంల ద్వారా వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా ఎల్‌ఎంఆర్‌ఎ బిల్స్‌ను మార్చ్‌ 1 నుంచి చెల్లించవచ్చు. ఎల్‌ఎంఆర్‌ఎ ఫైనాన్షియల్‌ విభాగం దీనికి సంబంధించిన అన్ని సాంకేతికపరమైన ఏర్పాట్లనూ బ్యాంకింగ్‌ సెక్టార్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా పూర్తిచేసింది. బ్యాంకుల నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఏటీఎం కార్డుల వినియోగం ఆధారపడి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com