'మేజర్' టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు
- April 10, 2021
హైదరాబాద్: యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు మేకర్స్. 'మేజర్' టీజర్ ను ఏప్రిల్ 12న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు సినిమా పోస్టర్ ద్వారా ప్రకటించారు. నిన్న ఈ చిత్రం నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 'ఉగ్రవాదులు హోటల్‌లోకి ప్రవేశించారు. ఉగ్రవాదులు ఆమె కోసం వచ్చారు. కానీ.. ఆమె వాళ్లతో ధైర్యంగా పోరాడింది' అంటూ 'మేజర్' మేకర్స్ విడుదల చేసిన శోభిత లుక్ ఆసక్తిని పెంచేసింది. ఈ చిత్రంలో శోభిత ప్రమోద అనే పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా 'మేజర్' చిత్రాన్ని జూలై 2న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







