75 ఏళ్లు దాటిన వారికి అపాయింట్మెంట్ లేకుండానే కోవిడ్ వ్యాక్సిన్‌

- April 10, 2021 , by Maagulf
75 ఏళ్లు దాటిన వారికి అపాయింట్మెంట్ లేకుండానే కోవిడ్ వ్యాక్సిన్‌

సౌదీ: కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండ‌టంతో వీలైనంత తొంద‌ర‌గా వీలైనంత ఎక్కువ మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే ప‌నిలో ఉంది. ఇందులో భాగంగా కింగ్డ‌మ్ ప‌రిధిలోని వృద్ధులు అంద‌రికీ వ్యాక్సిన్ అందించ‌టంపై ఫోక‌స్ చేసింది. 75 ఏళ్లు నిండిన వాళ్లంతా వెంట‌నే వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని, వారికి ఎలాంటి ముంద‌స్తు అపాయింట్మెంట్ కూడా అవ‌స‌రం లేద‌ని వివ‌రించింది. 75 ఏళ్లు నిండితే వ్యాక్సిన్ కేంద్రాల‌కు నేరుగా వెళ్లి టీకాలు తీసుకొవ‌చ్చ‌ని వివ‌రించింది. ఇదిలాఉంటే ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 587 కేంద్రాల్లో 60 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ అందించిన‌ట్లు వెల్ల‌డించింది. స‌మాజ ఆరోగ్య భ‌ద్ర‌త కోసం ప్ర‌తి ఒక్క‌రు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని కోరింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com