మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు..
- April 10, 2021
ముంబై: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు మహారాష్ట్ర లో కలకలం సృష్టిస్తోంది.భారత్‌లో రోజుకో రికార్డు తరహాలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. వాటిలో మెజార్టీగా మహారాష్ట్రలో నమోదు అవుతున్న కేసులే ఉంటున్నాయి.కరోనా ఫస్ట్ వేవ్‌లో నమోదైన పాజిటివ్ కేసుల రికార్డును..సెకండ్ వేవ్ ఎప్పుడో దాటేసింది.దీంతో.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు, నైట్ కర్ఫ్యూ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, ఇప్పుడు సంపూర్ణ లాక్ డౌన్ తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే.. లాక్‌డౌన్ విధించడం మినహా వేరే గత్యంతరం లేదని, ఇతర మార్గాలు కూడా కనిపించడం లేదని.. ఇవాళ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌లో సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.. ఇక, నెల పాటు లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని..దీనికి మీరంతా సహకరించాలని ఆయన రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు.ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన థాకరే.. లాక్‌డౌన్ విధించడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







