వన్‌ ఇయర్‌ బోనస్‌: బ్యాంక్‌ బంపర్‌ ఆఫర్‌

- March 02, 2016 , by Maagulf
వన్‌ ఇయర్‌ బోనస్‌: బ్యాంక్‌ బంపర్‌ ఆఫర్‌

బోనస్‌లు లేని ఉద్యోగాలు చేస్తున్నవారికి శుభవార్త. దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్‌ ఎన్‌బిడి మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. అయితే ఇది లక్కీ డ్రా మాత్రమే. మార్చ్‌ నుంచి జూన్‌ వరకు ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మినిమమ్‌ 10,000 దిర్హామ్‌ల సేలరీని బ్యాంక్‌లో డిపాజిట్‌ చెయ్యాల్సి ఉంటుంది. నెలవారీ సేలరీ రివార్డ్స్‌ 200,000 ఒక్కో విజేతకీ ఇస్తామని ఎమిరేట్స్‌ ఇబిడి వర్గాలు వెల్లడించాయి. గ్రాండ్‌ ప్రైజ్‌ మనీగా 500,000 అదృష్టవంతుడైన ఒక్క విజేతకు అందిస్తారు. వెయ్యిలో ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం కలగనుంది. అయినప్పటికీ, ఇది బంపర్‌ ఆఫర్‌ కిందే భావించాలి. ఔత్సాహికులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com