'టామ్‌కామ్' వెబ్ పోర్టల్ ని ఆవిష్కరించిన తెలంగాణ హోంమంత్రి

- March 02, 2016 , by Maagulf
'టామ్‌కామ్' వెబ్ పోర్టల్ ని ఆవిష్కరించిన తెలంగాణ హోంమంత్రి

 గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్లాలనుకునే కార్మికులందరినీ ఇకపై తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) ద్వారానే పంపిస్తామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నకిలీ వీసాలతో, తప్పుడు పద్ధతుల ద్వారా వెళ్లి అక్కడ ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సచివాలయంలో మంగళవారం టామ్‌కామ్ వెబ్ పోర్టల్‌ను మంత్రి ఆవిష్కరించారు. 'గల్ఫ్ దేశాలలో పనిచేయాలనుకొనేవారు టామ్‌కామ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే అర్హులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com