తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
- April 11, 2021
తిరుపతి: తిరుమల వెంకటేశ్వర రావు ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీ మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సరాదిన ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరపనున్నట్లు టిడిపి వెల్లడించింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా తెల్లవారుజామున 3.00 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారని తెలిపారు.
ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 13వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన (వర్చువల్ సేవలు) కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టిటిడి రద్దు చేసిందని టిటిడి ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్‌ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









