'అఖండ'... 5 మిలియన్ వ్యూస్
- April 14, 2021హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ 'అఖండ' అంటూ 'బీబీ3' టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. 'అఖండ' టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య సినిమా టీజర్ అలా వచ్చి రాగానే వైరల్ అయిపోయింది. వ్యూస్ తో పాటు లైక్స్ కూడా భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించింది 'అఖండ' టీజర్. ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది 'అఖండ' టీజర్. కాగా 'అఖండ'లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు