ఈ-వీసాలపై ఆంక్షలు తొలగించిన MHA

- April 14, 2021 , by Maagulf
ఈ-వీసాలపై ఆంక్షలు తొలగించిన MHA

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా మినహా మిగిలిన అన్ని ఎలక్ట్రానిక్ వీసాలపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో దాదాపు 156 దేశాల నుంచి ఈ-వీసాలపై మన దేశానికి వేర్వేరు కార్యకలాపాల కోసం రావచ్చు.ఈ-మెడికల్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాలతో విదేశీయులు మన దేశానికి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది మార్చిలో ఈ వీసాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ ఏడాది మార్చి 30న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో  ఈ-మెడికల్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్రిటన్, చైనాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ, కోవిడ్-19 కేసులు ప్రస్తుత స్థాయికి చేరడానికి ముందు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. ఈ-మెడికల్, ఈ-బిజినెస్ వీసాల కోసం గడచిన 10 రోజుల్లో చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒక ప్రయోజనం కోసం తీసుకున్న వీసాను వేరొక ప్రయోజనం కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com