ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి:రాచకొండ సీపీ మహేష్ భగవత్
- April 14, 2021
హైదరాబాద్: కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త ఉండాలని రాచకొండ సిపి మహేష్ భగ్వత్ తెలిపారు.ఈ రోజు రాచకొండ కమిషనరేట్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కు,శానిటైజర్ వాడాలి, మాస్కులు ధరించని వారిపై ఈ చలాన్ ద్వారా కేసు నమోదు చేసి 1000 జరిమానా విధిస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి కేసులు నమోదు చేసి ఫైన్ వేస్తాము.నిన్న మాస్క్ దరించని 832 మందిపై కేసులు నమోదు చేసాము.రాచకొండ పోలీసులు కూడా కరోనా వైరస్ పై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు.రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదువేల మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు.పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు రెండు వందల మంది కంటే ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్త వహించండి. అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్లు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని రాచకొండ సిపి ప్రజలను కోరారు .
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







