భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో విజృంభణ దారుణంగా ఉంది.రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ప్రపంచంలో రోజువారీ కేసుల్లో భారత్ టాప్ లిస్ట్ లో ఉన్నది.కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది.సెకండ్ వేవ్ లో కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.ఇక ఇదిలా ఉంటె తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్ లో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది.ఇందులో 1,25,47,866 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,69,743 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1185 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,74,308కి చేరింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







