హైదరాబాద్ ఏరోసిటీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన జీఎంఆర్

- April 16, 2021 , by Maagulf
హైదరాబాద్ ఏరోసిటీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన జీఎంఆర్

హైదరాబాద్: భారతదేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంలో భాగంగా ‘జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్‌’ను ప్రారంభిస్తున్నట్లు జీఎంఆర్ గ్రూప్ నేడు ప్రకటించింది. 

ఆకర్షణీయమైన, సుస్థిరమైన పట్టణ రూపాన్ని సంతరించుకుంటున్న జీఎంఆర్ ఏరోసిటీ - హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా, వ్యాపారానికి అవసరమైన వేగం, కనెక్టివిటీలను కలిగి ఉంది.

పెరుగుతున్న ఎయిర్ కనెక్టివిటీ, ప్రయాణీకులు, స్మార్ట్ టెక్నాలజీ, క్లాస్ లాజిస్టిక్స్ హబ్‌.... వీటన్నిటితో జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ ఒక ఎయిర్‌పోర్ట్ గేట్ వేగా పని చేస్తుంది. 

1500 ఎకరాలలో విస్తరించిన జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ బిజినెస్ పార్క్, రిటైల్ పార్క్, ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్స్ పార్క్, ఆతిథ్యం మొదలైన వాటి కోసం ముఖ్యమైన నిర్మాణాలతో ఒక సమగ్రాభివృద్ధి దృక్పథంతో రూపొందించబడుతోంది. పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, రెంటల్ అకామిడేషన్, విశ్రాంతి, వినోదం వంటి మౌలిక సదుపాయాలతో జీవితం, పని విషయాలలో సంపూర్ణ అనుభవాన్ని అందిస్తుంది. 

విశ్రాంతి, రిటైల్, వినోదాల కోసం జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో LIVE/WORK/PLAY కాన్సెప్టుతో లైఫ్ స్టైల్ డెస్టినేషన్ రిటైల్ ప్రాజెక్ట్ “జీఎంఆర్ ఇంటర్‌చేంజ్”ను రూపొందిస్తోంది. ఇంటర్‌ఛేంజ్ ప్రాజెక్టులో భాగంగా ఒక సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ ప్రతిపాదనలో ఉన్నాయి. ఏరోసిటీలోని వివిధ కస్టమర్ల కోసం ఒక హాస్పిటాలిటీ డిస్ట్రిక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. 

ఏరోసిటీ హైదరాబాద్‌లో ఉన్న GMR బిజినెస్ పార్క్ – రెడీ టు మూవ్ గ్రేడ్- A కార్యాలయాలు, బిల్ట్-టు-సూట్ క్యాంపస్‌లాంటి విభిన్న ఆఫీస్ రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్, 24/7 కార్యకలాపాల కోసం టెలికాం,  విద్యుత్ & ఐటీలలో ఉత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. డెడికేటెడ్ విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర గ్రిడ్‌తో అనుసంధానమైన విద్యుత్ లింక్, రక్షా, రాష్ట్ర  పోలీస్ మరియు సిఐఎస్‌ఎఫ్‌లతో కూడిన త్రీ-టైర్ సెక్యూరిటీ సిస్టమ్‌, నగరంతో వేగవంతమైన కనెక్టివిటీ; కాలుష్య రహిత మరియు ప్రణాళికాబద్ధమైన పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. 

అన్ని బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కోసం వన్-స్టాప్ క్లియరెన్స్ విండోగా పని చేసే నోటిఫైడ్ ఏరియా కమిటీ (NAC) ఇక్కడ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు దోహదపడుతుంది. హైదరాబాద్ ఏరోసిటీ గ్రీన్ టెక్నాలజీ, కొత్త తరం స్మార్ట్ డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉపయోగించుకుంటూ సుస్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది.

సుమారు 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో, పలు దశల్లో అభివృద్ధి చేయబడుతున్న నాలుగు టవర్లలో (టవర్ 1 పూర్తిగా ఆక్రమించబడగా, టవర్ 2 ఆక్యుపెన్సీకి సిద్ధంగా ఉంది) విస్తరించిన జీఎంఆర్ ఏరోసిటీ హైదరాబాద్ భవిష్యత్ వ్యాపార కారిడార్‌గా రూపొందించబడింది. ఈ బిజినెస్ పార్క్ - DR, BCP సైట్లు, గ్రేడ్ A కార్యాలయాలు, నెట్‌వర్క్ ప్లానింగ్ కార్యాలయాలు, సేల్స్ ఆఫీస్, R&D మొదలైన వాటికి సరైన ఎంపిక. 

ఫుడ్ కోర్ట్ / జిమ్నాసియం / రిటైల్ బ్యాంక్ బ్రాంచ్ / ప్రతిపాదిత హెల్త్ సెంటర్, విమానాశ్రయ పబ్లిక్ ప్లాజా లాంటి సౌకర్యాలు ఉద్యోగులకు వారి కార్యాలయ ప్రాంగణంలోనే సౌకర్యాలు ఉండేలా చూస్తాయి. దీని వల్ల  ఇక్కడ పని వాతావరణం ఉద్యోగులకు అత్యంత సౌకర్యవతంగా ఉంటుంది. 

ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్ మార్గం, ఎలివేటెడ్ కారిడార్‌ ద్వారా హైదరాబాద్ యొక్క ప్రైమరీ, సెకెండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లతో అనుసంధానించబడిన జీఎంఆర్ బిజినెస్ పార్క్ స్థానిక, ప్రపంచ కనెక్టివిటీ కలిగి ఉంది. దానికి తోడు, విమానాశ్రయం నుంచి నగరానికి 24 గంటలూ 150కి పైగా బస్సుల రాకపోకలు జరుగుతున్నాయి. త్వరలో ఎక్స్‌ప్రెస్ మెట్రో వ్యవస్థ కూడా ఇక్కడికి అందుబాటులోకి రానుంది.   

జీఎంఆర్ విమానాశ్రయం ల్యాండ్ డెవలప్‌మెంట్ (ALD) సీఈఓ అమన్ కపూర్, "హైదరాబాద్ ఏరోసిటీ భారతదేశంలో వ్యాపారం చేసే విధానంలో ఒక సమూలమైన మార్పును తీసుకురానుంది. ఇది వర్క్‌స్పేస్ డిజైన్ సామర్థ్యాన్ని పెంచడానికి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ వర్క్‌స్పేస్‌లను అందిస్తుంది. సేవ, మౌలిక సదుపాయాల కల్పనలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి అనేక ప్రశంసలు అందుకున్న విమానాశ్రయం పర్యావరణ వ్యవస్థలో భాగంగా, హైదరాబాద్ ఏరోసిటీ తన భాగస్వాములకు వ్యాపారం చేయడంలో అత్యంత సౌలభ్యాన్ని అందిస్తుంది. వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పిస్తూ వారు తమ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది.హైదరాబాద్ ఏరోసిటీ సమర్ధవంతమైన వికేంద్రీకృత అభివృద్ధికి ఉదాహరణగా ఉంటూ, నగరవాసులు ఒక సురక్షితమైన, సుసంపన్నమైన పని, జీవన విధానాలను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది.’’ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com