ఫైజర్ వ్యాక్సిన్ పై దుబాయ్ కీలక ప్రకటన

- April 17, 2021 , by Maagulf
ఫైజర్ వ్యాక్సిన్ పై దుబాయ్ కీలక ప్రకటన

దుబాయ్: కోవిడ్ -19 టీకాల అర్హత ప్రమాణాల విస్తరణలో భాగంగా దుబాయ్ హెల్త్ అథారిటీ (డీఎచ్ఏ) కీలక ప్రకటన విడుదల చేసింది. దుబాయ్ లో ఫైజర్ వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రొఫైజర్ కు సంబంధించి విడుదలైన తాజా ప్రకటన ఇలా ఉంది..

* కొరోనా సోకిన వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇకపై మూడు నెలలు వేచి ఉండనవసరం లేదు. కరోనా సోకినప్పుడు తేలికపాటి/అసిమ్పటోమాటిక్ లక్షణాలు అయినట్లయితే, వారు తమ ఐసోలేషన్ పూర్తయిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
* తల్లి పాలిచ్చే మహిళలతో పాటు గర్భం ధరించాలని యోచిస్తున్న వారు కూడా ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని డీఎచ్ఏ ప్రకటించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com