పెంపుడు సింహం దాడిలో వ్యక్తి మృతి

- April 17, 2021 , by Maagulf
పెంపుడు సింహం దాడిలో వ్యక్తి మృతి

సౌదీ అరేబియా: సౌదీ రాజధానిలో  ఓ వ్యక్తి తన పెంపుడు సింహం దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. రియాద్ నగరంలోని అస్-సులే సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు అక్కడికి చేరుకుని, సింహం నుంచి ఆ వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి వెంటనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. క్రూర మృగాల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలనే విషయాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com