రమదాన్: వర్చువల్ యాక్టివిటీస్ నిర్వహించనున్న మ్యూజియంలు
- April 17, 2021
ఖతార్: ఖతార్ లో పలు మ్యూజియంలు పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో వర్చువల్ కార్యక్రమాల్ని నిర్వహించనున్నాయి. ఖతార్ చిల్డ్రన్స్ మ్యూజియం (క్యుసిఎం), గరంగావ్ వర్క్ షాప్ నిర్వహించనుంది. సంప్రదాయ బాస్కెట్ వీవింగ్ నేర్పిస్తారు ఈ కార్యక్రమంలో. స్వీట్లు, నట్స్ పొందుపర్చడానికి వీటిని వినియోగిస్తారు. కీచెయిన్ల మేకింగ్ వంటి కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు రెండు సెషన్లలో ఈ కార్యక్రమాలు నడుస్తాయి. 6 నుంచి 11 ఏళ్ళ వయసుగల చిన్నారులు వీటిల్లో పాల్గొనవచ్చు. షేక్ ఫైసల్ బిన్ కాసిం అల్ థని మ్యూజియం బిహైండ్ యాన్ ఆబ్జెక్ట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించనుంది. సంప్రదాయ పద్ధతుల్లో స్టోరీ టెల్లింగ్ ఈ కార్యక్రమం ప్రత్యేకత. కళా రూపాల ప్రదర్శన ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏప్రిల్ 29 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 7 నుంచి 12 ఏళ్ళ వయసు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశ వుంది. మ్యూజియం స్పార్క్స్ వంటి కార్యక్రమాల్నీ నిర్వహిస్తారు. 3-2-1 ఖతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియం ప్రముఖ అథ్లెట్ల ఇంటర్వ్యూలను ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







