కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు
- April 17, 2021
ఒమన్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను అవసరమైతే మరింత కఠిన చర్యలకు వెనుకాడకూడదని ఒమన్ అథారిటీస్ భావిస్తున్నాయి. దోఫార్ గవర్నరేట్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుప్రీం కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, పూర్తి లాక్ డౌన్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దోఫార్ గవర్నరేట్ పరిధిలో వ్యాపార కార్యకలాపాల్ని సస్పెండ్ చేస్తున్నామనీ, ఏప్రిల్ 17 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలనీ, ఎక్కముంది గుమికూడకూడదనీ, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకుంటూ వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







