క్యు.ఆర్.సి.ఎస్. అంచనా: 61,865 మంది లబ్దిదారులకు రమదాన్ సాయం

- April 17, 2021 , by Maagulf
క్యు.ఆర్.సి.ఎస్. అంచనా: 61,865 మంది లబ్దిదారులకు రమదాన్ సాయం

ఖతార్: ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (క్యు.ఆర్.సి.ఎస్.), పదులు వేల గ్రూపులకు రమదాన్ నేపథ్యంలో సాయం అందించేందుకోసం పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ‘రేస్ టు ఆల్ దట్ ఈజ్ గాడ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రమదాన్ ఇఫ్తార్, జకాతుల్ ఫితర్, ఈద్ క్లాతింగగ్ వంటి పేర్లతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్మికులు, రోగులు, పేద కుటుంబాలకు సాయం అందించడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. రెడీ మేడ్ ఫుడ్ మీల్స్ పేరుతో ఇప్తార్ ప్రాజెక్టు చేపట్టారు. 1.2 మిలియన్ ఖతారీ రియాల్స్ ఖర్చుతో 48,000 మంది లబ్దిదారులకు ఈ ప్రాజెక్టుని పరిమితం చేస్తున్నారు. కార్డియాలిటీ ఇఫ్తార్ పేరుతో రోగులకు మరో కార్యక్రమం చేపడుతున్నారు. మొత్తం 7,500 లబ్దిదారులకు ఈ కార్యక్రమం ద్వారా సాయం అందుతుంది. 262,000 ఖతారీ రియాల్స్ ఖర్చవుతుంది. రమదాన్ ప్రొవిజన్స్ పేరుతో 1,220 మంది లబ్దిదారులకు ఆహార భద్రతను కల్పిస్తారు. ఇందు కోంస 280,000 ఖతారీ రియాల్స్ ఖర్చవుతోంది. జకాత్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ ఫితర్ వంటి కార్యక్రమాల ద్వారా మరింతమందికి సాయం చేయనున్నారు. www.qrcs.org.qa వెబ్ సైట్ ద్వారా లేదంటే డోనర్ సర్వీసు 66666364 అలాగే 33998898 నెంబర్లకు ఫోన్ చేసి డొనేషన్లు అందించవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com