యూఏఈ చేరుకున్న భారత మంత్రి జై శంకర్, షేక్ అబ్దుల్లాతో సమావేశం
- April 19, 2021
యూఏఈ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, యూఏఈ చేరుకున్నారు. మినిస్టర్, ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ యూఏఈ)తో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. షేక్ అబ్దుల్లాతో సమావేశం కానుండడం పట్ల ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు జై శంకర్. కాగా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ కూడా యూఏఈలోనే వున్నారు. భారత విదేశాంగ మంత్రితో ఎలాంటి సమావేశం వుండదని పాకిస్తన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా, యూఏఈతో భారతదేశానికి సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఎకనమిక్ కో-ఆపరేషన్ అలాగే కమ్యూనిటీ వెల్ఫేర్ వంటి అంశాలపై యూఏఈతో భారత విదేశాంగ మంత్రి చర్చలు జరుపుతారని, విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, భారత విదేశాంగ మంత్రి అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒకే సమయంలో యూఏఈలో వుండడం చాలా అరుదైన సంఘటన అని అధికారిక వర్గాలంటున్నాయి. కాగా, గత నవంబర్ నెలలో జై శంకర్, యూఏఈలో పర్యటించారు. షేక్ అబ్దుల్లా, జై శంకర్ ను ఢిల్లీలో ఫిబ్రవరిలో కలిశారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







