పాక్షిక కర్ఫ్యూ సమయంలో ట్రాఫిక్ సమస్యలు

- April 19, 2021 , by Maagulf
పాక్షిక కర్ఫ్యూ సమయంలో ట్రాఫిక్ సమస్యలు

కువైట్ సిటీ: రాత్రి 7 గంటల తర్వాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకోసం నైట్ కర్ఫ్యూ విధించడం జరిగింది. అయితే, నిబంధనల్ని పాటించకుండా కొందరు విచ్చలవిడిగా వాహనాల్ని రోడ్లపైకి తెస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కాగా, భద్రతా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో, ఆ తనిఖీల కారణంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. ఎగ్జిట్ పర్మిట్లను తనిఖీ చేయడం ఈ సమస్యకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క, బాధ్యతారాహిత్యంతో వాహనాల్ని రోడ్లపైకి తీసుకురావడమూ ఈ సమస్యకు కారణం అని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com