భారత్ లో కరోనా విజృంభణ
- April 19, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది.తొలి వేవ్ భయపెడితే.. సెకండ్ వేవ్‌లో భయం తగ్గినా.. కేసులు మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ను దాటేసిన రోజువారీ కేసులు.. ఇప్పుడు మూడు లక్షల వైపు పరుగులు తీస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 2,73,810 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.1,619 మంది కరోనా బాధితులు మృతిచెందారు.ఇదే సమయంలో 1,44,178 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారని కేంద్రం పేర్కొంది.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,50,61,919కు చేరుకోగా.. యాక్టివ్ కేసులు 19,29,329గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 1,29,53,821 మంది రికవరీ అయితే.. 1,78,769 మంది ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు.. ఇప్పటి వరకు 12,38,52,566 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







