ప్లాస్టిక్ బ్యాగ్ లో Dh1m డబ్బుతో సైకిల్ ప్రయాణం..ఆ తర్వాత ఏం జరిగింది?
- April 20, 2021
దుబాయ్: ఓ వ్యక్తి మిలియన్ దిర్హామ్ ల డబ్బును ఓ ప్లాస్టిక్ బ్యాగులో వేసుకున్నాడు.సైకిల్ ఎక్కి బ్యాంకు బయల్దేరాడు.అంత పెద్ద మొత్తంలో డబ్బులు అంత సింపుల్ గా అందరికి తెలిసేలా ప్లాస్టిక్ బ్యాగులో వేసుకొని సైకిల్ పై వెళ్తున్న ఆ వ్యక్తిని అంతా అశ్చర్యంగా చూస్తుండిపోయారు. అయితే..అతని నిర్లక్ష్యాన్ని చూసి తిక్కరేగిన పోలీసులు మాత్రం చూస్తూ ఊరికే ఉండలేకపోయారు.వెంటనే అతని దగ్గరికి వెళ్లి డబ్బు గరించి ఆరా తీసి...నేరాలను ఆస్కారం ఇచ్చేలా నిర్లక్ష్యం వ్యవహరించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.అతనికి ఫైన్ వేశారు.దుబాయ్ ఎమిరాతి పరిధిలో ఈ ఘటన చోటు చేసకుంది.బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేందుకు అలా ప్లాస్టిక్ బ్యాగ్ లో మిలియన్ దిర్హామ్ లను సైకిల్ పై తీసుకెళ్తున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు.నేరాలకు ఆస్కారం ఇచ్చేలా డబ్బుల విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, బ్యాంకులు, మనీ ఎక్సెంజ్ కేంద్రాల దగ్గర తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.జనం ఉన్న ప్రదేశంలో డబ్బులు బయటికి తీసి లెక్కపెట్టడం వంటివి కూడా సేఫ్టీ ప్రోటోకాల్ ప్రకారం తప్పేనని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







