44లక్షల మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్‌ వృథా

- April 20, 2021 , by Maagulf
44లక్షల మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్‌ వృథా

న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో...పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి.అయితే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అధిక మోతాదుల వ్యాక్సిన్‌ వృథా అయినట్లు ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది.ఏప్రిల్‌ 11 వరకు పలు రాష్ట్రాలు వినియోగించిన 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లలో,44 లక్షలకు పైగా డోసులు వృథా అయినట్లు సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం వెల్లడించింది.దేశ వ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో జనవరి మధ్య నుండి ఏప్రిల్‌ 11 వరకు మొత్తం మీద 23 శాతం వ్యాక్సిన్‌లు వృథా అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో 12.10 శాతం వ్యాక్సిన్‌లు వృథా కాగా, 9.74 శాతం వృథాతో రెండో స్థానంలో హర్యానా ఉన్నట్లు తెలిపింది. అలాగే మణిపూర్‌లో 7.8 శాతం, తెలంగాణలో 7.55 శాతం వ్యాక్సిన్‌లు వృథా అయ్యాయి. ఇక కేరళ, బెంగాల్‌,హిమాచల్‌ప్రదేశ్‌, మిజోరమ్‌, గోవా, డామన్‌ అండ్‌ డయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లో మాత్రం జీరో వేస్టేజ్‌ ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు.మే1 నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com