కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
- April 20, 2021
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఇందులో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. రాహుల్ గాంధీతో సహా అనేక మంది నేతలు కరోనా బారిన పడ్డారు. నిన్న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు.అంతకుముందు వ్యాక్సినేషన్ మూడో విడతపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.ఈ విధానంలో బలహీన వర్గాల వారికి వ్యాక్సిన్ అందుతుందనే భరోసా లేదని ఆయన ఆరోపించారు. ఇది వివక్షాపూరితమైన విధానమని దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







