"పరిశ్రమలకు ఆక్సిజన్ ను తగ్గించండి..COVID రోగులకు ఇవ్వండి" - ఢిల్లీ హై కోర్ట్ ఆదేశం

- April 20, 2021 , by Maagulf
\

న్యూఢిల్లీ: భారతదేశ రాజధానిలోని COVID-19 రోగులకు తగినంత ఆక్సిజన్ సరఫరా చేయబడటం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. ఈ పరిణామంలో..పరిశ్రమల నుండి హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సరఫరాను మళ్లించడం సాధ్యమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది.

"పరిశ్రమలు వేచి ఉండగలవు, రోగులు వేచి ఉండలేరు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి" అని జస్టిస్ విపిన్ సంఘి మరియు రేఖ పల్లి ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఆక్సిజన్ కొరత ఉన్నందున అక్కడ చేరిన COVID-19 రోగులకు ఆక్సిజన్ ఇవ్వడం తగ్గించాలని గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు బలవంతం చేస్తున్నారని ధర్మాసనం తెలిపింది.

"ఆక్సిజన్ సరఫరాను తగ్గించలేని ఈ పరిశ్రమలు ఏవి" అని కోర్టు కేంద్ర ప్రభుత్వ లాయరు మోనికా అరోరాను ప్రశ్నించింది. COVID-19 రోగులకు ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి ఏమి చేయవచ్చనే దానిపై సూచనలు తీసుకోవాలని మోనికా అరోరా ను కోర్టు కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com