ఒమన్: పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
- April 20, 2021
మస్కట్: దోఫార్ గవర్నరేట్ అలాగే సమీపంలోని మౌంటెయిన్స్ మీద వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు ఒమన్ మిటియరాలజీ వెల్లడించింది. సుల్తానేట్ వ్యాప్తంగా పలు చోట్ల ఆకాశం మేఘాలతో నింి వుంటుంది. దోఫార్ కోస్టల్ ప్రాంతాల్లో ఎక్కువగా మేఘాలు కనిపిస్తాయి. సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురియడానికి అవకాశం వుంది. సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా గవర్నరేట్లలోని కోస్టల్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, అత్యల్పంగా 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మస్కట్ గవర్నరేట్ పరిధిలో నమోదవుతాయి. విలాయత్ ఆఫ్ సోహార్ విషయానికొస్తే, 34 అత్యధికం, 25 అత్యల్పం.. ఉష్ణోగ్రతలు వుంటాయి. విలాయత్ ఆఫ్ ఇబ్రి 38 - 24, విలాయత్ ఆఫ్ నిజ్వా 37-24, విలాయత్ ఆఫ్ రుస్తాక్ 38-24 డిగ్రీలుగా అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఫాగ్ ఫార్మేషన్ వుంటుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







