తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ప్రారంభం
- April 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ప్రారంభమైంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇంకా వ్యాపార సముదాయాలు తెరిచి ఉన్నాయి. రోడ్లపై ప్రైవేటు వాహనాలు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి గమ్యస్థానానికి వెళ్లేందుకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజల నుంచి ఇష్టానుసారంగా ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్లు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ఈ సమయంలో నిత్యావసర వస్తువులు , ఎమర్జెన్సీ సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఈ రాత్రి కర్ఫ్హ్యును ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. రాత్రి 8 గంటలకు షాప్స్, మాల్స్, థియేటర్లు, ఇతర వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుమతి నిమిత్తం వాహనాలకు కూడా మినహాయింపు ఇచ్చింది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి నగరానికి వచ్చే ప్రజల వద్ద టికెట్ ఉండాలని ప్రభుత్వం సూచించింది.హైదరాబాద్ రోడ్ల మీద పరిస్థితిని ముగ్గురు పోలీస్ కమిషనర్లు సజ్జనార్, మహేష్ భగవత్,అంజనీ కుమార్ సమీక్షిస్తున్నారు.


తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







