యూకేకు వెళ్లే విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా
- April 21, 2021
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.కరోనా ఉద్ధృతి దృష్ట్యా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇంగ్లాండ్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది.ఏప్రిల్ 24 నుంచి 30 వరకు భారత్-యూకే మధ్య విమానాలు రద్దు చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించింది.
భారత్, యూకే మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు గమనిక.. యూకే ఇటీవల ప్రకటించిన ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నాం. ఈనెల 24 నుంచి 30వ తేదీల్లో ఢిల్లీ, ముంబయి నుంచి యూకేకు వారానికి ఒక విమానాన్ని నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెబ్‌సైట్, మా సోషల్‌మీడియా ఛానళ్లలో అప్‌డేట్ చేస్తాం. విమానాల రీషెడ్యూలింగ్, రీఫండ్ తదిరత వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తాం’’అని ఎయిరిండియా బుధవారం ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేట్







