స్కూల్‌ మినీ ఒలింపిక్స్‌ 2016 తేదీ ఖరారు

- March 02, 2016 , by Maagulf
స్కూల్‌ మినీ ఒలింపిక్స్‌ 2016 తేదీ ఖరారు

మూడవ స్కూల్‌ మినీ ఒలింపిక్స్‌కి ప్రిపరేషన్స్‌ జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 21 నుంచి మే 5 వరకు ఈ ఒలింపిక్స్‌ జరుగుతాయి. రెండు వారాల పాటు జరిగే ఈ ఈవెంట్‌, వరుసగా మూడోసారి. బహ్రెయిన్‌ ఒలింపిక్‌ కమిటీ (బిఓసి), మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సహాయంతో వివిధ పాఠశాలలకు చెందిన 1992 మంది విద్యార్థులతో ఈ ఈవెంట్‌ని నిర్వహించడం జరుగుతుంది. బిఓసి సెక్రెటరీ జనరల్‌ అబ్దుల్‌రహమ్మాన్‌ అస్కర్‌ మాట్లాడుతూ, స్కూల్‌ మినీ ఒలింపిక్స్‌ని ఎంతో ముఖ్యమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1992 మంది విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఈ ఈవెంట్‌ కొత్త చరిత్రను సృష్టిస్తుందని ఆయన అన్నారు. పబ్లిక్‌ హెల్త్‌ పట్ల అవేర్‌నెస్‌ పెంచడం, అలాగే ఆటల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడం, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం వంటి ముఖ్య ఉద్దేశ్యాలతో ఒలింపిక్స్‌ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఆటల ద్వారా ఆరోగ్యంగా ఉంటామనే మంచి మెసేజ్‌ ఈ పోటీల ద్వారా ఇస్తున్నామని చెప్పారు అబ్దుల్‌రహమాన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com