స్మోకింగ్ చేస్తూ పోలీసుపై దాడి, వ్యక్తి అరెస్ట్
- April 21, 2021
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో, అదీ ఉపవాస సమయంలో బహిరంగంగా స్మోకింగ్ చేస్తూ ఓ కువైటీ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు, పోలీసు అధికారులపై దాడికి యత్నించినట్లు కూడా అభియోగాలు మోపబడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో, అది కూడా ఉపవాస సమయంలో స్మోకింగ్ చేయవద్దని సూచిస్తే, నిందితుడు పోలీసు అధికారిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై రెండు కేసులు నమోదు చేశారు అధికారులు. రమదాన్ మాసంలో ఉపవాస సమయంలో బహిరంగంగా తినడం, స్మోకింగ్ చేయడం వంటివాటిపై నిషేధం వుంది. 100 కువైటీ దినార్ల వరకు జరీమానా, నెల రోజుల వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







