వారంలోగా 4 లక్షల ‘రెమిడెసివిర్‌’ ఇంజక్షన్లు - కేటీఆర్

- April 21, 2021 , by Maagulf
వారంలోగా 4 లక్షల ‘రెమిడెసివిర్‌’ ఇంజక్షన్లు - కేటీఆర్

ప్రభుత్వ ఆసుపత్రులకు వారంలోగా 4 లక్షలకుపైగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇవాళ రెమిడెసివిర్‌ ఉత్పత్తిదారులతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు. సీఎం ఆదేశాల మేరకు ఉత్పత్తిదారులతో చర్చించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత పెరిగింది. కరోనా వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి వైద్యులు ఆక్సిజన్‌తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్‌లను ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ లోడ్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నాయి. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యతో పాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం సైతం పెరిగింది.

ఉత్పత్తి తగ్గడం.. చాలాచోట్ల ఇంజక్షన్లు లభించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలతో మంత్రి కేటీఆర్‌ ఇవాళ చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com