ఖతార్‌లో మెడిసిన్‌ వెండింగ్‌ మెషీన్లు

- March 02, 2016 , by Maagulf
ఖతార్‌లో మెడిసిన్‌ వెండింగ్‌ మెషీన్లు

మిడిల్‌ ఈస్ట్‌లో తొలిసారిగా ఖతార్‌ మెడిసిన్‌ వెండింగ్‌ మెషీన్లను ప్రారంభించనుంది. డాక్టర్లు సూచించిన మందుల్ని ఫార్మసిస్టులతో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌ మెషీన్ల ద్వారా విక్రయించేందుకు ఖతార్‌ ఏర్పాట్లు చేస్తోంది. న్యూ విమెన్స్‌ హాస్పిటల్‌ ఈ సర్వీసు గురించిన ప్రయోగాలు చేస్తోంది. ఆసుపత్రికి చెందిన వివిధ డిపార్ట్‌మెంట్స్‌ ఆటోమేటెడ్‌ సెల్ఫ్‌ సర్వీస్‌ కియోస్క్‌లను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానుంది. ఆసుపత్రి ఫార్మసీ వద్ద పేషెంట్లకు సమయం వృధా కాకుండా ఈ కియోస్కీ మెడిసిన్‌ వెండింగ్‌ మెషీన్‌ ఉపకరించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పేషెంట్‌ ఐడీతో డాక్టర్లు డిజిటల్‌ ప్రిస్క్రిప్షన్‌ ప్రిపేర్‌ చేస్తారు. దానికి ఓ ఐడీని క్రియేట్‌ చేస్తారు. కియోస్కీ వద్దకు వెళ్ళి ఐడీని నమోదు చేస్తే, దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్‌ తద్వారా మందులు రానున్నాయి. ఫార్మసిస్టుల కొరత నుంచి ఆసుపత్రులకూ ఈ కియోస్కీల ద్వారా ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో పేషెంట్లకు మెరుగైన విధంగా మందులు అందుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com