భార‌త్ లో చిక్కుకుపోయిన వారి కోసం స్పెష‌ల్ రిజిస్ట్రేష‌న్ డ్రైవ్‌

- April 22, 2021 , by Maagulf
భార‌త్ లో చిక్కుకుపోయిన వారి కోసం స్పెష‌ల్ రిజిస్ట్రేష‌న్ డ్రైవ్‌

కువైట్ సిటీ: కువైట్ తిరిగి వెళ్లాల్సి ఉన్నా...కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో భార‌త్ లో చిక్కుకుపోయిన వారి వివ‌రాల‌ను సేక‌రిస్తోంది భార‌త రాయ‌బార కార్యాల‌యం.ఇందుకోసం స్పెష‌ల్ రిజిస్ట్రేష‌న్ డ్రైవ్ ను చేప‌ట్టింది.కువైట్ వెళ్లాల్సి ఉండి భార‌త్ లోనే ఉండిపోయిన వారు త‌మ వివ‌రాల‌ను https://forms.gle/sExZK1GKW36BLpVz7లింక్ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు.2020లో రిజిస్ట‌ర్ చేసుకున్న‌వారు కూడా ప్ర‌స్తుతం చేప‌ట్టిన స్పెష‌ల్ రిజిస్ట్రేష‌న్ డ్రైవ్ లో భాగ‌స్వామ్యం కావొచ్చు.భార‌త్ కు వ‌చ్చిన త‌ర్వాత రెసిడెన్సీ గ‌డువు ముగిసిన వారు, కువైట్ తిరిగ వెళ్ల‌లేక ఉద్యోగం క‌ల్పోయిన వారు, కువైట్లో సొంత ఇళ్లు, కుటుంబ‌స‌భ్యులు ఉన్న‌వారు, తిరిగి ఉద్యోగంలో చేరాల‌నుకునేవారు, జీత‌బ‌త్యాలు బ‌కాయిల కోస ఎదురుచూస్తున్న వారు రాయ‌బార కార్యాల‌యం చేప‌ట్టిన డ్రైవ్ లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు.అయితే...ఈ వివ‌రాల సేక‌ర‌ణ ఎంత మంది భార‌త్ లో చిక్కుకుపోయార‌నే స‌మాచారం సేక‌రించేందుకు మాత్ర‌మే.స‌మాచారం సేక‌రించిన త‌ర్వాత త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com