భయపెడుతున్న ఫోటో..అయితే విషయమేమిటంటే..
- April 22, 2021
భారత్: దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతూ కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో కొద్దిరోజుల క్రితం ఓ ఫో టో అటు మీడియాని ఇటు సోషల్ మీడియాని షేక్ చేసింది. అదే ఈ పెద్దావిడ ఫోటో.
ఆక్సిజన్ సిలిండర్ తో రోడ్డుపై దీనంగా ఉన్న ఈ ఫోటోని చూపించి కొందరు భారత్ లోని సెకండ్ వేవ్ దుస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారంటూ మీడియాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదన్న నిజాన్ని కొందరు బయటపెట్టారు.

2018లో ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటో అంటూ ఆ వార్త వివరాలను కూడా తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆ తల్లి శ్వాస తీసుకుంటుంటే దాన్ని భుజాలపై కొడుకు ఎత్తుకున్న దృశ్యాలు సంచలనమయ్యాయి. అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఆ తల్లీకొడుకులు రోడ్డుపక్కనే అలా కూర్చుండిపోయారు. అప్పట్లోనే మీడియాలో ఈ దృశ్యాలు ప్రసారం కావడంతో అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు.
ఆ ఫోటోలను ఎవరో ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేశారు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని టెక్ నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!







