తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టు స్ట్రాంగ్ కౌంటర్
- April 23, 2021
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ జరిగింది. హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, కర్ఫ్యూ కారణంగా రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గాయని కోర్టుకు ఆయన తెలిపారు. దీంతో ప్రభుత్వం సమర్పించిన నివేదికపై కోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది.
కర్ఫ్యూ విధించాక రాష్ట్రంలో కేసులు ఎక్కడ తగ్గాయో చూపించాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బార్లు, థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారని, కుంభమేళా వెళ్లినవారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నారని, మరి వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని పేర్కొంది. ఆర్ టి పి సి ఆర్ టెస్టు రిపోర్టు ఎందుకు 24 గంటల్లోపు ఇవ్వడం లేదని,. వీఐపీలకు 24 గంటల్లోపే ఎందుకు ఇస్తోంది ప్రభుత్వం.. అని వర్షం కురిపించింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!







