LIC పాలసీదారులకు గమనిక..
- April 24, 2021
భారత్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ ఇన్సురెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ (ఎల్ఐసి)కి ఇప్పటీకి వినియోగదారుల సంఖ్య అధికమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సంస్థలో ఎక్కువగా పాలసీలు తీసుకుంటుంటారు. అయితే ఆ సంస్థ కరోనా కాలంలో అత్యధిక ప్రీమియం చార్జీలు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. “తాత్కాలిక గణాంకాల ప్రకారం కరోనా కాలంలో ఎల్ఐసి అత్యధికంగా రూ .1.84 ట్రిలియన్ (లక్ష కోట్లు) కొత్త ప్రీమియంను వసూలు చేసింది. పాలసీదారులకు క్లైయిమ్ లుగా రూ.1.34 ట్రిలియన్లు చెల్లిస్తుందని ఎల్ఐసీ తన సోషల్ మీడియాలో ట్వీచ్ చేసింది.
ప్రతి వినియోగదారుడి మీ పాలసీ స్టేటస్, ప్రీమియం స్టేటస్ తెలుసుకోవడమనేది చాలా ముఖ్యం. అయితే వీటి కోసం ఎల్ఐసీ సంస్థ వరకు వెళ్లాల్సిన పనిలేదు. సులభంగా మీ ఫోన్ నుంచి ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇటీవల ఎల్ఐసి తన డిజిటల్ చెల్లింపులను నిర్వహించడానికి పేటిఎంను నియమించింది, ఇది ఎల్ఐసి పాలసీదారులకు వారి ప్రీమియం చెల్లించడంలో మరింత సౌలభ్యాన్ని ఇస్తుంది
ఎల్ఐసీ పాలసీ ఆన్ లైన్ స్టేటస్ చూడటం..
1. ముందుగా.. ఎల్ఐసీ అధికారిక వెబ్ సైడ్ licindia.in ఓపెన్ చేయాలి.
2. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.
3. ఆ తర్వాత.. మీ పుట్టిన తేదీ, పాలసీ నంబర్ ఎంటర్ చేయాలి. దీని కోసం ఎలాంటి చార్జీ ఉండదు. ఎప్పుడైనా దీనిని చెక్ చేసుకోవచ్చు.
4. మరిన్న సందేహాలు ఉంటే 022 6827 6827 నంబరుకు కాల్ చేయవచ్చు. అలాగే.. 9222492224 నంబరుకు LICHELP<పాలసీ నంబర్ ఎంటర్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి. ఇందుకు ఎలాంటి చార్జీ ఉండదు.
sms చేయడం..
మీ ఎల్ఐసీ పాలసీ స్టేటస్ చెక్ చేయడానికి ముందుగా 56677 నంబరుకు ఎస్ఎంఎస్ పంపాలి. అలాగే మీరు ప్రీమియం స్టేటస్ తెలుసుకోవాలంటే.. ASKLIC PREMIUM’ అని టైప్ చేసి 56677 న SMS పంపాలి. మీ పాలసీ ముగిసినట్లయితే, మీరు ‘ASKLIC REVIVAL’ అని టైప్ చేసి 56677 కు పంపవచ్చు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







