భారత్ సెకండ్ వేవ్..ఆందోళన చెందిన ఆంటోనీ ఫౌచీ
- April 24, 2021
వాషింగ్టన్: కరోనా వైరస్ విషయంలో భారత్ ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటోందని అమెరికా వైద్య విభాగం ఉన్నత సలహాదారు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు తాము ఏవిధంగానైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
'భారత్ ప్రస్తుతం అత్యంత భయంకర పరిస్థితులు ఎదుర్కొంటోంది. భారత్‌కు ఏవిధంగానైనా సాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. నిన్న ఆ దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. భారత్‌లో క్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి అమెరికాకు చెందిన సీడీసీ అక్కడి సంబంధిత విభాగంతో కలిసి సాంకేతికంగా సహకారం, సహాయాన్ని అందించేందుకు పనిచేస్తోంది. ఆ దేశంలో కొత్త వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వాటిపై వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావం చూపిస్తాయనేది చెప్పలేం. కానీ ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది' అని ఫౌచీ తెలిపారు.
కాగా, భారత్‌లో గడిచిన 24 గంటల్లో 3,46,786 కేసులు నమోదయ్యాయి. మరో 2,624 మంది మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు వదిలారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







